Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే: వరదనీరు ఇంకా పెరిగే అవకాశం ఉందా?

Webdunia
శుక్రవారం, 15 జులై 2022 (17:57 IST)
ముఖ్యమంత్రి జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. గోదావరి వరద పరీవాహక ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో ఉంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభావిత గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు. 
 
వారి కోసం ప్రభుత్వం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసింది. దీంతో..స్వయంగా పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయించిన సీఎం జగన్.. శుక్రవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
 
ఇరిగేషన్ శాఖ పైన సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గోదావరికి వస్తున్న వరదలపై ఇరిగేషన్‌ అధికారుల నుంచి ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 
రానున్న 24 నుంచి 48 గంటల వరకూ వరదనీరు ఇంకా పెరిగే అవకాశం ఉందని సమీక్షా సమావేశంలో అధికారులు వివరించారు. 
 
తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్‌సహా బేసిన్‌లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా భారీ వరదనీరు విడుదలవుతున్నట్టుగా వివరించారు. దాదాపు 23 -24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments