కర్నాటక సీఎం కుమారస్వామి కోడలిగా బెజవాడ అమ్మాయి

కర్నాటక ముఖ్యమంత్రి హెచ్.డి కుమారస్వామి కోడలిగా తెలుగింటి అమ్మాయి వెళ్లనుంది. కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడకు బెజవాడ అమ్మాయితో పెళ్లి చేయాలని ఆయన భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే బెజవాడ అమ్మ

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (09:30 IST)
కర్నాటక ముఖ్యమంత్రి హెచ్.డి కుమారస్వామి కోడలిగా తెలుగింటి అమ్మాయి వెళ్లనుంది. కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడకు బెజవాడ అమ్మాయితో పెళ్లి చేయాలని ఆయన భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే బెజవాడ అమ్మాయి కర్నాటక సీఎం ఇంటి కోడలిగా అడుగుపెట్టనుంది.
 
శుక్రవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి వచ్చిన కుమారస్వామి.. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ప్రముఖ పాదరక్షల కంపెనీ యజమాని కుమార్తెను చూసేందుకు కుమారస్వామి సతీసమేతంగా వెళ్ళారు. కుమారస్వామి వెంట మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌, రఘురామ కృష్ణంరాజు తదితరులు ఉన్నారు.
 
పాదరక్షల కంపెనీ యజమాని ఇంట్లోనే కుమారస్వామి దంపతులు భోజనం చేశారు. పాదరక్షల కంపెనీ యజమాని కుమార్తెకు, కుమారస్వామి కొడుకు నిఖిల్‌కు రెండేళ్ల క్రితమే బెంగళూరులో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. దీంతో వీరిద్దరికీ వివాహం చేసేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది. అందులో భాగంగా కుమారస్వామి శుక్రవారం కాబోయే కోడలిని చూసుకునేందుకు విజయవాడ వచ్చారు. 
 
కాగా, నిఖిల్‌ గౌడ.. దేవగౌడకు ముద్దుల మనవడు. కన్నడ, తెలుగు భాషల్లో నిర్మితమైన 'జాగ్వార్‌' సినిమాతో 2016లో నిఖిల్‌ హీరోగా తెరంగేట్రం చేశారు. భారీ ఖర్చుతో ఈ సినిమాను కుమారస్వామి స్వయంగా నిర్మించారు. ప్రస్తుతం నిఖిల్‌ రెండు కన్నడ సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. అన్నీ సమక్రంగా జరిగితే నిఖిల్‌కు బెజవాడ అమ్మాయికి మధ్య పెళ్లి జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments