Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన కాళ్ళకు మొక్కిన వ్యక్తికి షాకిచ్చిన సీఎం చంద్రబాబు (Video)

ఠాగూర్
ఆదివారం, 20 అక్టోబరు 2024 (12:32 IST)
తన కాళ్లు మొక్కిన వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు షాకిచ్చారు. తన పాదాలకు నమస్కరించిన వ్యక్తి పాదాలను చంద్రబాబు తాకారు. దీంతో మంత్రి నారాయణతో పాటు అక్కడున్నవారంతా ఒకింత షాక్‌కు గురయ్యారు. 
 
తన కాళ్లకు మొక్కేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే తిరిగి తాను కూడా అదే పని చేస్తానంటూ గతంలో చంద్రబాబు పలుమార్లు చెప్పారు. ఇపుడు అన్నంత పనీ చేశారు. రాజధాని అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయ నిర్మాణ పనులను ఆయన శనివారం ప్రారంభించేందుకు వచ్చిన సీఎం చంద్రబాబు పాదాలను తాకి ఓ వ్యక్తి నమస్కరించారు. దీనికి వెంటనే స్పందించిన చంద్రబాబు.. నన్ను కూడా మీ కాళ్ళకు నమస్కారం చేయమంటారా? అని ఆ వ్యక్తి కాళ్లు పట్టుకునేందుకు వంగారు. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాకయ్యారు. 
 
తనక కాళ్ళకు ఎవరూ నమస్కారం చేయొద్దని, తల్లిదండ్రులు, గురువులు పాదాలకు మాత్రమే నమస్కారం చేయాలని చంద్రబాబు పదేపదే చెబుతూ వస్తున్నారు. ఎవరైనా తన కాళ్లకు నమస్కరించే ప్రయతద్నం చేస్తే తాను కూడా అదే పని చేస్తానని ఇటీవల చంద్రబాబు హెచ్చరించిన విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments