Webdunia - Bharat's app for daily news and videos

Install App

'స్థానికం' కింద తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (11:58 IST)
స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఈ కోటా కింద నాలుగు ఎమ్మెల్యే కోటా, రెండు గవర్నర్ కోటా, ఒక స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు. ఈ స్థానాలకు టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. 
 
బుధవారం అర్థరాత్రి ఎమ్మెల్యే కోటా కింద యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు, అశోక్‌బాబు, బీటీ నాయుడు పేర్లను చంద్రబాబు ఖరారు చేశారు. ప్రస్తుతం ఏపీ ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడుని తిరిగి ఎమ్మెల్సీగా కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 
 
అలాగే, గవర్నర్‌ కోటాలో శివనాథ్‌ రెడ్డి, శమంతకమణి పేర్లు, విశాఖ స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా బుద్ధా నాగ జగదీశ్వర్‌రావు పేరును ఖరారు చేశారు. ఈ అభ్యర్థులంతా గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. 
 
కాగా, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఏడు ఎమ్మెల్సీ పదవులకుగాను నాలుగు స్థానాలను బీసీలకే కేటాయించారు. రెండు స్థానాలు అగ్రవర్ణాలకు చెందిన వారికి దక్కగా కాపు, రెడ్డి సామాజిక వర్గాలకు చెందినవారికి అవకాశం లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments