Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం ఏరియల్ సర్వే

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (22:51 IST)
తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (శనివారం) ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్షించనున్నారు. నివర్‌ తుపానుపై నేడు జరిగిన కేబినెట్‌ సమావేశంలో కూడా సీఎం చర్చించారు. దెబ్బతిన్న పంటలకు డిసెంబర్‌ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం ఆదేశించారు.

శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. తుపాను ప్రభావంపై సీఎం వైఎస్‌ జగన్‌ నిన్న తన క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. తుపాను ప్రభావం, కురుస్తున్న వర్షాలపై సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

నెల్లూరు జిల్లాలో కరెంటు షాక్‌తో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు. వర్షాలు అనంతరం పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని, భారీ వర్షాలుకారణంగా ఏదైనా నష్టం వస్తే సత్వరమే సహాయం అందించడానికి సిద్ధం కావాలని ఆదేశాలు ఇచ్చారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments