Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ కసరత్తు

Advertiesment
జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ కసరత్తు
, మంగళవారం, 17 నవంబరు 2020 (21:32 IST)
వచ్చే నెలలో జరగనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కసరత్తులు మొదలు పెట్టారు. 
 
ఇందులో భాగంగా ఎన్నికలే ప్రధాన అంశంగా తెరాస పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. 
 
ఈ సమావేశానికి తెరాసకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరు కావాలని సీఎం ఆదేశించారు. 
 
ఆయా జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమన్వయం చేసుకొని సమావేశానికి తీసుకురావాల్సిందిగా మంత్రులకు సీఎం సూచించారు.
 
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని డివిజన్ల బాధ్యతలు అప్పగించారు. ఇందుకు సంబంధించిన డివిజన్ల వివరాలను నేతలకు ఇప్పటికే అందించారు.

అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అసమ్మతి నేతలతో ఎలా వ్యవహరించాలి, విపక్షాల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలి, ఏయే అంశాలను ప్రచారంలోకి తీసుకెళ్లాలనే అంశాలపై రేపటి సమావేశంలో పార్టీ నేతకు కేసీఆర్‌ స్పష్టతనివ్వనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోము వీర్రాజుకు మాన‌వ‌త్వం లేదు: టీడీపీ