Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌ష్ట స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ సాయం శ‌క్తినిచ్చింది: కైకాల సత్యనారాయణ

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (12:27 IST)
ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని న‌వ‌ర‌స న‌ట దిగ్గ‌జం కైకాల స‌త్య‌న్నారాయ‌ణ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఆయ‌న మాన‌వ‌త్వానికి శాల్యూట్ చేశారు. గత ఏడాది నవంబర్ లో అనారోగ్యం పాలై అపోలో హాస్పిటల్ లో చేరిన టాలీవుడ్‌ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది. పూర్తిగా కోలుకున్న ఆయన ఏపీ సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. 
 
 
తన అనారోగ్య సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. తాను ఆసుపత్రిలో ఉన్న సమయంలో తనకు అందించిన అమూల్యమైన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కాల్ చేసి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం ద్వారా మీరు చూపిన శ్రద్ధకు నేను చాలా సంతోషిస్తున్నానని ఆయన అన్నారు. 
 
 
మీరు హామీ ఇచ్చినట్టుగానే మీ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు, వైద్య ఖర్చులను తీర్చడానికి ఆర్థిక సహాయంతో సహా అన్ని రకాల సహాయాన్ని అందించారు. ఆ కష్ట సమయాల్లో మీ సహాయం నాకు, నా కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చిందని ఆయన అన్నారు. మీరు చూపిన ఈ శ్రద్ధ మీకు కళాకారుల పట్ల, వారి శ్రేయస్సు పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసింది, ప్రజల పట్ల మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రం మంచి చేతుల్లో ఉందనే భరోసా ఇస్తుందని కైకాల పేర్కొన్నారు. అనారోగ్యం పాలైనప్పటి నుంచి అండగా ఉన్నందుకు నేను మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్న, అని చెబుతూ ఆయన నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేశారు. 
 
 
తాను సంతకం చేయలేక పోవడంతో, తన కుమారుడు కొడుకు ఈ కృతజ్ఞతా లేఖపై సంతకం చేశారని కైకాల వెల్లడించారు. అంతే కాక తనకు బాగోనప్పుడు తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారు. అలాగే అభిమానుల ప్రార్థనలే  తనని మళ్ళీ మాములు మనిషిని చేశాయని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments