Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి ఫిక్స్.. వరుడు కాదు పొమ్మన్నాడు.. అమెరికాలో చిత్తూరు అమ్మాయి ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (09:35 IST)
అమెరికాలో చిత్తూరు అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంకా ఆమెకు పెళ్లి జరగాల్సి వుంది. ఇంతలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు పోలీస్ కాలనీకి చెందిన సుష్మా అనే యువతి అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం 3 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లి కుమారుడు పెళ్లికి అంగీకరించకపోవడంతో మనస్థాపానికి గురై అమెరికాలో ఆత్మహత్య చేసుకుంది. 
 
చిత్తూరు పోలీస్ కాలనీకి చెందిన శ్రీహరి కుమార్తె సుష్మ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నది. పూతలపట్టు మండలం బందార్ల పల్లె గ్రామానికి చెందిన మురళి కుమారుడు భరత్ అనే యువకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. వారిద్దరి కుటుంబసభ్యులు చర్చించుకుని పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నారు. పెద్దలు ఈ నెల 3వ తేదీన ఉదయం 3 గంటలకు వివాహం ఖాయం చేశారు. శుభలేఖలు కూడా ముద్రించారు. పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారు. 
 
కానీ వారం రోజుల క్రితం యువకుడు పెళ్లికి నిరాకరించాడు. ఈ విషయంపై సుష్మ, భరత్ మధ్య పంచాయతీ జరిగింది. ఈ విషయం తల్లిదండ్రులకు కూడా తెలిసింది. అయితే అంతా సర్దుకుంటారని అనుకున్నారు. కానీ చివరకు తన కుమార్తె మృతి చెందిందని వచ్చిన వార్తతో అవాక్కయ్యారు.
 
పెళ్లికి భరత్ నిరాకరించడంతోనే సుష్మా మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శుభలేఖలు ముద్రించి పెళ్లి రోజున ఇలాంటి ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం తమను కలచివేసిందని వాపోయారు. తమకు న్యాయం చిత్తూరు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments