Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీరలు దొంగతనం చేసిన చిత్తూరు గస్తీ పోలీసులు

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (22:49 IST)
రాత్రి వేళల్లో పట్టణాల్లో దొంగతనాలు జరుగకుండా పోలీసులు గస్తీ తిరుగుతుంటారు. దీంతో దొంగలు చోరీ చేసేందుకు భయపడుతుంటారు. కానీ, పోలీసులే దొంగలుగా మారి చోరీలు చేస్తే... మరి ప్రజల ఆస్తులకు ఎవరు రక్షణ కల్పిస్తారు. చిత్తూరు జిల్లాలో పోలీసులే చోరీ చేస్తూ పట్టుబడ్డారు. చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాకు చిక్కాయి.
 
ఓ ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ రాత్రి స‌మ‌యంలో రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న బట్టల దుకాణంలో చోరీ చేశారు. ఇద్దరు పోలీసులు దుకాణం వ‌ద్దే స్కూటర్ ఆపి, ఫుట్‌పాత్‌పై ఉండే వస్త్ర దుకాణంలోకి వెళ్లి దుస్తులు తీసుకుని వెళ్లిపోయారు. చోరీ జరిగిన ఆరు రోజుల తర్వాత సీసీ కెమెరా ద్వారా ఈ విష‌యం బయట పడింది. 
 
పోలీసుల‌పై దుకాణ‌ యజమాని పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. దుస్తులు చోరీ చేసింది ఏఆర్ కానిస్టేబుల్ అని, అత‌డికి సాయం చేసిన‌ మరో పోలీసు ఏఆర్ ఏఎస్ఐ అని అధికారులు నిర్ధారించారు. అయితే, ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. చివ‌ర‌కు మీడియాకు ఈ సీసీ దృశ్యాలు చిక్క‌డంతో విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments