Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరే... నా పెళ్లామే కావాల్రా నీకు... పట్టపగలే యువకుడి దారుణ హత్య

వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చిత్తూరు జిల్లా నారాయణవనంకు సమీపంలోని మిట్టనైనారు కండ్రిగలో జరిగిన ఈ వివరాలను పరిశీల

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (14:25 IST)
వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చిత్తూరు జిల్లా నారాయణవనంకు సమీపంలోని మిట్టనైనారు కండ్రిగలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మిట్టనైనారు కండ్రిగకు చెందిన పి.షణ్ముగం (23) అనే యువకుడు ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అతనికి పరిచయం ఏర్పడింది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి భార్యతోపాటు ఆ యువకుడిని కూడా హెచ్చరించాడు. 
 
అయినప్పటికీ వారిద్దరిలో మార్పు రాకపోవడంతో షణ్ముగాన్ని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తన ప్లాన్‌లో భాగంగా, షణ్ముగంను గురువారం ఉదయం 10 గంటలకు పుత్తూరు సమీపంలోని రెండు చెరువుల కట్ట వద్దకు ఫోన్ చేసి పిలిపించాడు. అప్పటికే అక్కడ వేచివున్న మరికొందరితో కలిసి షణ్ముగంపై మారణాయుధాలతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు షణ్ముగం ఎంతగానో ప్రయత్నించాడు. 
 
అయినప్పటికీ ఫలితం లేదని గ్రహించిన షణ్ముగం తన పరిస్థితిని ఫోన్ చేసి గ్రామంలోని తన స్నేహితులకు చేరవేశాడు. విషయం తెలుసుకున్న అతని స్నేహితులు అక్కడకు చేరుకునేలోపు షణ్ముగం ప్రాణాలు కోల్పోయాడు. షణ్ముగం పొత్తి కడుపు, ఛాతి తదితర చోట్ల కత్తితో పొడవడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడే ప్రాణాలు విడిచాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments