Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం... మరొకరితో లింక్ పెట్టుకుందని టీచర్ గొంతుకోసిన మరో టీచర్(video)

మహిళలపై దారుణాలు ఆగడంలేదు. చిత్తూరు జిల్లాలో గురువారం దారుణం ఘటన జరిగింది. గంగవరం మండలం మబ్బువారి పేట ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ప్రేమ కుమారిని సహోపాధ్యాయుడు అత్యంత కిరాతక

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (19:36 IST)
మహిళలపై దారుణాలు ఆగడంలేదు. చిత్తూరు జిల్లాలో గురువారం దారుణం ఘటన జరిగింది. గంగవరం మండలం మబ్బువారి పేట ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ప్రేమ కుమారిని సహోపాధ్యాయుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఉపాధ్యాయురాలు క్లాసులో విద్యార్థులకు పాఠాలు చెపుతున్న సమయంలోనే చంద్రమౌళి అనే మరో టీచర్ ఆమె గొంతుకోసి అతి కిరాతకంగా హత్యచేశాడు. 
 
భర్త పోయాడన్న బాధతో వున్న ఆమెను చంద్రమౌళి చేరదీసి లోబరుచుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్నినెలలుగా వీరి మధ్య ఈ సంబంధం కొనసాగుతోంది. అయితే గత కొన్నిరోజులుగా ప్రేమకుమారిపై అనుమానం పెట్టుకున్నాడు చంద్రమౌళి. ఆమె మరెవరితోనే కలుస్తోందన్న అనుమానం మొదలైంది. దీంతో ఆగ్రహాన్ని తట్టుకోలేకపోయిన చంద్రమౌళి, పాఠశాలలో పిల్లలకు క్లాస్ చెబుతుండగా ప్రేమకుమారిపై కత్తితో దాడికి దిగాడు. ఆమె శరీరంపై కత్తితో విచక్షణారహితంగా నరికాడు. 
 
రక్తపుమడుగులో ఉన్న ప్రేమకుమారిని పాఠశాల యాజమాన్యం వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. కాగా నిందితుడు చంద్రమౌళి పరారయ్యాడు. ఇతడి కోసం గాలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments