తన 50 యేళ్ళ జీవితంలో 20 యేళ్ళ పాటు స్తబ్దుగా సాగిపోయిందని మెగా బ్రదర్ నాగబాబు ఆవేదనతో చెప్పారు. తనను డైరెక్షన్ వైపు వెళ్ళాల్సిందిగా పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పారని, కానీ ఆ పని నేను చేయలేకపోయానన్నారు. నిర్మాతగా, ఆర్టిస్టుగా తాను ఎక్కువ ఫెయిల్యూర్స్
తన 50 యేళ్ళ జీవితంలో 20 యేళ్ళ పాటు స్తబ్దుగా సాగిపోయిందని మెగా బ్రదర్ నాగబాబు ఆవేదనతో చెప్పారు. తనను డైరెక్షన్ వైపు వెళ్ళాల్సిందిగా పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పారని, కానీ ఆ పని నేను చేయలేకపోయానన్నారు. నిర్మాతగా, ఆర్టిస్టుగా తాను ఎక్కువ ఫెయిల్యూర్స్‌ను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు నాగబాబు. ఎవరైనా వచ్చి పవన్, చిరంజీవి కంటే మీరు బాగా నటిస్తారని చెబితే నమ్మే వ్యక్తిని కాదన్నారు. తనను ఎవరు ఏమన్నా పట్టించుకోకని, అయితే తన అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను ఎవరైనా ఏమన్నా అంటే చాలా బాధపడతానని చెప్పారు నాగబాబు.
జనసేన తరపున కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు నాగబాబు. చిరంజీవి కూడా జనసేనకు సపోర్టు చేస్తే బాగుంటుందన్నారు. అయితే నేనేమీ అన్న మీద ఒత్తిడి చేయను. నా అభిప్రాయం నేను చెబుతున్నానన్నారు నాగబాబు. జనసేనలో పనిచేయమని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తనకు చెప్పలేదన్నారు నాగబాబు.
పవన్ పిలుపు కోసమే వెయిట్ చేస్తున్నా.. ఆయన పిలిస్తే జనసేనలోకి వెళ్ళి కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఒక టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు తెలిపారు. ఎప్పుడూ టివి ఛానల్స్‌కు ఇంటర్వ్యూ ఇవ్వని నాగబాబు మొదటిసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీస్తోంది.