Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కరోనా'ను జయించిన యోధులారా ప్లాస్మా దానానికి ముందుకు రండి : చిరు పిలుపు

Webdunia
శనివారం, 25 జులై 2020 (13:56 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ బారినపడిన చాలా మంది కోలుకుంటుంటే. తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు మాత్రం కోలుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే, కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేస్తే మాత్రం కరోనా రోగుల ప్రాణాల రక్షించవచ్చని వైద్యుల అభిప్రాయపడుతున్నారు. 
 
ఈ క్రంలో కరోనా నుంచి కోలుకున్న వారు తమ ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు రావాలంటూ మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. నిజానికి గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్లాస్మా డొనేషన్‌పై సైబరాబాద్ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలికారు.
 
'కరోనా నుంచి కోలుకున్న అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను... దయచేసి మీ ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రండి. తద్వారా ఇతరుల ప్రాణాలు కాపాడండి. కరోనా కష్టకాలంలో ఇంతకుమించిన మానవతా సాయం మరొకటి ఉంటుందని అనుకోను. కరోనాను గెలిచిన యోధులారా, ఇప్పుడు మీరు రక్షకులు అవ్వాల్సిన తరుణం వచ్చింది' అంటూ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ లో శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments