Webdunia - Bharat's app for daily news and videos

Install App

సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ ప్రదర్శించిన తిరుపతిలోని చిన్నారులు

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (18:22 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో స్మైల్ ఫౌండేషన్ నిర్వహించిన ఎన్‌ఎక్స్‌ప్లోరర్స్ కార్నివాల్ లో   తిరుపతి జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి ఎంపికైన 59 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ మరియు గణితం) రంగాలలో తమ వినూత్న ఆలోచనలను ప్రదర్శించారు. మొత్తం 35 "మార్పు ప్రాజెక్ట్‌లు"  ఇక్కడ ప్రదర్శించబడ్డాయి, వీటిని  2,500 మంది విద్యార్థుల వినూత్న ఆలోచనలు నుండి ఎంపిక చేశారు. 
 
ఎన్‌ఎక్స్‌ప్లోరర్స్ జూనియర్ ప్రోగ్రామ్ అనేది గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ సోషల్ ఇన్వెస్ట్‌మెంట్ STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ మరియు మ్యాథమెటిక్స్) విద్యా కార్యక్రమం. స్మైల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, నెల్లూరు, తెలంగాణలోని ఖమ్మం, హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలు, కేరళలోని త్రిసూర్ జిల్లాల్లోని 203 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇది 6 మరియు 7 అకడమిక్ గ్రేడ్‌లలోని 10 నుండి 12 సంవత్సరాల వయస్సు గల 25,000 మంది పాఠశాల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తోంది.
 
తిరుపతి జిల్లా స్థాయి కార్నివాల్‌లో, రోజువారీ జీవితంలో పర్యావరణ అనుకూల వినియోగ వనరులతో పాటుగా నీరు, శక్తి మరియు ఆహారం యొక్క పరిరక్షణ మరియు సరైన వినియోగం వంటి అంశాల పట్ల వున్నాయి. జిల్లా సైన్స్ అధికారి (తిరుపతి), శ్రీ భానుప్రసాద్ మాట్లాడుతూ, “స్మైల్ ఫౌండేషన్ ద్వారా అమలుచేయబడిన ఎన్‌ఎక్స్‌ప్లోరర్స్ కార్యక్రమం మన పిల్లలను భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తుంది. జిల్లా సైన్స్ అధికారిగా, ఈ కార్యక్రమం విద్యార్థులకు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నానన్నారు.
 
మండల విద్యాధికారి(తిరుపతి), మాట్లాడుతూ, “ఈ గ్లోబల్ ప్రోగ్రామ్‌ను మా పాఠశాలలకు తీసుకువచ్చినందుకు స్మైల్ ఫౌండేషన్- షెల్‌ను నేను అభినందిస్తున్నాను. విద్యార్థుల మధ్య స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహించడంలో మరియు ప్రపంచ సమస్యలకు స్థానిక పరిష్కారాలను కనుగొనడంలో  స్మైల్ ఫౌండేషన్ యొక్క ప్రశంసనీయమైన ప్రయత్నాలు దీర్ఘకాలంలో ఫలించగలవని నేను భావిస్తున్నాను" అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments