Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో కరోనా ఎఫెక్ట్.. చికెన్ బిర్యానీ ఆర్డర్లు డల్

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (11:26 IST)
హైదరాబాదులో నిత్యం రద్దీగా వుండే షాపింగ్ మాల్స్‌ బోసిపోయాయి. కరోనా ఎఫెక్ట్‌తో హోటల్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్‌ నిర్మానుష్యంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా చికెన్‌‌‌‌ అమ్మకాలు తగ్గినా.. హైదరాబాద్‌‌‌‌లో కరోనా వైరస్ డిటెక్ట్‌‌‌‌ అయ్యే వరకు చికెన్‌‌‌‌ బిర్యానీ అమ్మకాలు జోరుగానే సాగాయి. రెండు రోజులుగా బిజినెస్‌‌‌‌ 50 శాతం తగ్గిందని హోటల్‌‌‌‌ నిర్వాహకులు చెప్తున్నారు. ఫుడ్‌‌‌‌ ఆర్డర్లపైనా ఈ ఎఫెక్ట్‌‌‌‌ ఉందన్నారు.
 
కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్​ఎంసీ, స్కూల్ ఎడ్యుకేషన్​, హోం శాఖ, ఐ అండ్​ పీఆర్​, టూరిజం, ట్రాన్స్​పోర్ట్ డిపార్ట్​మెంట్లకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. జీహెచ్​ఎంసీ పరిధిలోని బస్​ స్టాప్​లు, రైల్వే.. మెట్రో స్టేషన్లు, పబ్లిక్​ ప్లేసుల్లో హోర్డింగులపై కరోనా నివారణపై ప్రచారం చేయాలని, ఈ పనులన్నీ శుక్రవారం రాత్రిలోగా పూర్తి చేయాలని సూచించింది. 
 
జోన్​కు ఒక నోడల్​ ఆఫీసర్​ను నియమించి క్షేత్రస్థాయి సిబ్బందితో రాపిడ్​ రెస్పాన్స్​ టీమ్​లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ సిబ్బంది ఇంటింటికీ తిరిగి కరోనా లక్షణాలున్నవారిని గుర్తించాలని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments