Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా చెవిరెడ్డి ప్రమాణ స్వీకారం

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (09:09 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఎక్స్ అఫిషియో సభ్యులుగా ప్రభుత్వ విప్, తుడ ఛైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైకుంఠం ద్వారం నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ముందుగా శ్రీవారి ఆలయంలోని గరుడాల్వార్ సన్నిధిలో  చెవిరెడ్డి చేత అదనపు ఈఓ ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం శ్రీవారిని దర్శించుకున్న చెవిరెడ్డి రంగనాయక మండపానికి చేరుకున్నారు. పండితులు వేద ఆశీర్వచనం పలికి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించారు. స్వామి వారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

వ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు శక్తి వంచన లేకుండా నా వంతు బాధ్యత నిర్వర్తిస్తానని చెవిరెడ్డి స్పష్టం చేశారు. శ్రీ వారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు సేవ చేసే భాగ్యం మరోమారు దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments