Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీస‌ర్వేతో భూ వివాదాల‌కు చెక్: మంత్రి పెద్దిరెడ్డి

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (16:47 IST)
‘వైఎస్సార్‌  జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’పై పథకంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ సమావేశం అయ్యింది. డిప్యూటీ సీఎంధర్మాన కృష్ణదాస్, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ, ఇతర ముఖ్య అధికారులు హాజరయ్యారు.

సచివాలయం 3వ బ్లాక్ సమావేశమందిరంలో జరిగిన సమీక్షలో మంత్రులు మాట్లాడుతూ, వంద సంవత్సరాల తరువాత తొలిసారి ఈ తరహా సమగ్ర సర్వేతో భూ వివాదాలకు చెక్ పడనుందని అన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో మొత్తం 70 కోర్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు, సమగ్ర సర్వే కోసం 13,371 పంచాయతీ కార్యదర్శులు, 10,935 మంది డిజిటల్ అసిస్టెంట్లు, 10,185 మంది గ్రామ సర్వేయర్లకు బాధ్యతలు అప్పగించినట్టు వివరించారు. రీ సర్వేతో రికార్డుల ప్రక్షాళణ అవుతుందని పేర్కొన్నారు.
 
మంత్రుల కమిటీ సమావేశంలో సిసిఎల్‌ఎ నీరభ్ కుమార్ ప్రసాద్, ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) ఉషారాణి, పిఆర్‌ అండ్ ఆర్డీ కమిషనర్ గిరిజాశంకర్, సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్ సిద్దార్ధ్ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎంఎం నాయక్, డిఎంజి, ఎపిఎండిసి విసి అండ్ ఎండి విజి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments