Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాదనీరాజనం వేదికపై ఆక‌ట్టుకున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (23:23 IST)
శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదిక‌పై, వ‌సంత మండ‌పంలో ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. బ్ర‌హ్మోత్స‌వాల్లో ఐదో రోజు మంగ‌ళ‌వారం జ‌రిగిన కార్య‌క్ర‌మాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.
 
నాద‌నీరాజ‌నం వేదిక‌పై ...శ్రీ విష్ణు స‌హ‌స్ర‌నామ స్తోత్ర పారాయ‌ణం
తిరుప‌తికి చెందిన భార‌తీయ విద్యాభ‌వ‌న్ క‌ళాబృందం స‌భ్యులు ఉద‌యం 9 నుండి 9.45 గంట‌ల వ‌ర‌కు శ్రీ విష్ణు స‌హ‌స్ర‌నామ స్తోత్ర పారాయ‌ణం చేశారు.
 
ఆధ్యాత్మిక ప్ర‌వ‌చ‌నం
తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన‌పీఠం ఆచార్యులు శ్రీ మోహ‌న‌రంగాచార్యులు ఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌నివాసుడు - నిత్య కైంక‌ర్య మూర్తి అనే అంశంపై ఉప‌న్య‌సించారు.
 
హ‌రిక‌థ‌
తిరుప‌తి ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు భాగ‌వ‌తార్‌ మ‌ధ్యాహ్నం 2 నుండి 3.15 గంట‌ల వ‌ర‌కు హ‌రిక‌థ పారాయ‌ణం చేశారు.
 
అన్న‌మ‌య్య సంకీర్త‌న ల‌హ‌రి
టిటిడి అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు తిరుప‌తికి చెందిన శ్రీ ర‌ఘునాథ్‌ బృందం మ‌ధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 4.30 గంట‌ల వ‌ర‌కు అన్న‌మ‌య్య సంకీర్త‌న ల‌హ‌రి పేరిట ప‌లు అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌ను ల‌య‌బ‌ద్ధంగా ఆల‌పించారు.
 
వ‌సంత మండ‌పంలో ....
వ‌సంత మండ‌పంలో నిర్వ‌హిస్తున్న‌వేంక‌టాచ‌ల మ‌హ‌త్యం, వాహ‌న‌సేవ‌ల వైశిష్ట్యంపై ఉప‌న్యాస కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం ఏడ‌వ‌ రోజుకు చేరుకుంది.
 
ఇందులో భాగంగా అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ వేంక‌టాచ‌ల మ‌హ‌త్యంపై ఉప‌న్య‌సించారు. అనంత‌రం మంగ‌ళ‌వారం రాత్రి శ్రీ‌వారికి జ‌రిగే గ‌జ‌ వాహనం, బుధ‌వారం ఉద‌యం జ‌రిగే సూర్యప్రభ వాహ‌న‌సేవ‌ల వైశిష్ట్యాన్ని క‌మ‌నీయంగా వ్యాఖ్యానించారు. చివ‌రగా వేంక‌టాచ‌ల మ‌హ‌త్యంలోని స్తోత్రాల‌ను 12 మంది టిటిడి వేద‌పండితులు భ‌క్తుల‌చే పారాయ‌ణం చేయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments