విక్రమ్ ల్యాండర్ కూలిన ప్రాంతంలో చీకటి.. వెలుతురు వచ్చాక?

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (14:46 IST)
విక్రమ్ ల్యాండర్ కూలినట్లు భావిస్తున్న ప్రాంతం ప్రస్తుతం రాత్రి సమయం కావడంతో  తమ ప్రయత్నాలకు విరామం ఇచ్చినట్లు  ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. విక్రమ్ ల్యాండర్‌పై ఆశలు వదులుకోలేదని, సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తూనే ఉన్నామని ఇస్రో పేర్కొంది. అక్కడ రాత్రి సమయం 14 రోజులు ఉండడంతో విక్రమ్‌కు సౌరశక్తి లభించదని, మళ్లీ పగటి సమయం ఆరంభమయ్యాక విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు తిరిగి ప్రయత్నాలు ప్రారంభిస్తామని తెలిపారు. 
 
సెప్టెంబర్ 7వ తేదీన ఇస్రో గ్రౌండ్ స్టేషన్‌కు విక్రమ్ ల్యాండర్‌కు మధ్య సమాచార సంబంధాలు కోల్పోయాయి. మరికొద్ది క్షణాల్లో ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది అనగా గాడి తప్పింది. ప్రస్తుతం చంద్రుడిపై చీకటి అలుముకుంది. 10 రోజుల క్రితం అయితే చంద్రుడిపై సూర్యుడి కిరణాలు పడేవి. దీంతో ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకై ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు పూర్తిగా చీకటి నెలకొనడంతో ఆ ప్రయత్నాలకు కాస్త బ్రేక్ పడింది. అయితే మళ్లీ ల్యాండర్‌తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తామని ఇస్రో ఛైర్మెన్ డాక్టర్ శివన్ చెప్పారు.
 
చంద్రమండలంపై వెలుతురు రాగానే తమ ప్రయత్నాలను ప్రారంభిస్తామని శివన్ చెప్పారు. ఇన్ని రోజుల తర్వాత ల్యాండర్, గ్రౌండ్ స్టేషన్‌ల మధ్య కమ్యూనికేషన్‌ను పునరుద్ధరించడం కష్టమే అయినప్పటికీ ప్రయత్నించడంలో తప్పులేదని డాక్టర్ శివన్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

తర్వాతి కథనం
Show comments