Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కుప్పంకు చంద్రబాబు.. మూడు రోజుల అక్కడే మకాం

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (10:29 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం కుప్పం వెళుతున్నారు. అక్కడ ఆయన మూడు రోజుల పాటు మకాం వేస్తారు. ఈ సమయంలో పార్టీ నేతలు, బూత్ ఇన్‌చార్జిల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తారు. ఓటర్ల జాబితాపై పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తారు. అలాగే, కుప్పంలో కొత్తగా నిర్మించిన కొత్త పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు. 
 
ప్రధానంగా అధికార పార్టీ నేతలు తమ అధికారాన్ని ఉపయోగించి ఒకే ఓటరుకు మూడు చోట్ల ఓటు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అందువల్ల పార్టీ నేతలు, కార్యకర్తలు మరింత అప్రమత్తంగా ఉండేలా వారికి పలు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. 
 
అంతేకాకుండా కుప్పం పరిధిలో మొత్తం 11 క్లస్టర్లు ఉండగా, ప్రతి క్లస్టర్‌కు 45 నిమిషాల సమయాన్ని చంద్రబాబు కేటాయించి, పార్టీ నేతలు సమాలోచనలు చేస్తారు. గురువారం మధ్యాహ్నం ఆయన అన్ని క్లస్టర్లలోని 50 మంది ప్రధాన నేతలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. 
 
అదేవిధంగా కుప్పం - పలమనేరు హైవే పక్కన నిర్మించిన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. కుప్పం నియోజకవర్గంలోని కొందరు టీడీపీ నేతల తీరుపై ఫిర్యాదులు వచ్చాయి. వీరిపై పార్టీ కార్యకర్తలు కూడా అసంతృప్తితో ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. నియోజకవర్గ పరిస్థితిని వ్యక్తిగతంగా తానే పర్యవేక్షిస్తానని... ఇందులో భాగంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి వస్తానని చంద్రబాబు గతంలో చెప్పారు. చెప్పిన విధంగానే గత 8 నెలల్లో ఆయన కుప్పంకు వెళ్తుండటం ఇది మూడో సారి కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments