Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన కార్యాలయానికి చంద్రబాబు: సత్కరించిన పవన్ దంపతులు

ఐవీఆర్
మంగళవారం, 4 జూన్ 2024 (20:33 IST)
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సతీమణి చంద్రబాబును సత్కరించారు. పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పాదాలకు నమస్కరిస్తూ ఆశీస్సులు తీసుకున్నారు.

<

ఈరోజు NDA కూటమి సాధించిన చారిత్రాత్మక విజయం నేపథ్యంలో, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అభినందించేందుకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇరువురు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు.@ncbnpic.twitter.com/Q2WWeOHI2Z

— JanaSena Party (@JanaSenaParty) June 4, 2024 >కేంద్రంలో కింగ్ మేకర్ చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం స్థానం నుంచి పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి కేఆర్‌జే భరత్‌పై 47 వేలకుపైగా ఓట్లతో చంద్రబాబు విజయం సాధించారు. ఈ క్రమంలో రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఎన్టీయే కూటమి సమావేశంలో పాల్గొననున్నారు.
 
 
ఈ సందర్భంగా లోకేశ్‌ తన తల్లి భువనేశ్వరిని ప్రేమగా ముద్దాడారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు విక్టరీ సింబల్‌ చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యర్తలు భారీగా సంబరాలు చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్యాణ్‌రామ్‌ మెరుపు చిత్రం పాటలో పాల్గొన్న విజయశాంతి - తాజా అప్ డేట్

హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా కవర్ పేజీలో అల్లు అర్జున్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

తర్వాతి కథనం
Show comments