Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పంలో చంద్రబాబు పర్యటన.. లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాం..

సెల్వి
మంగళవారం, 26 మార్చి 2024 (16:33 IST)
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. రెండో రోజు కుప్పంలో పర్యటించిన ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలను స్వీకరించారు.
 
స్థానికులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికి కుప్పంలో ఈసారి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రెండు నెలల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని హామీ ఇచ్చారని, అనంతరం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు వివరించారు. 
 
కాకినాడ శివాలయంలో పూజారిపై వైసీపీ నేత చేసిన దాడిని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల వైసీపీ నేతల అగౌరవానికి అద్దం పట్టే ఈ ఘటన దారుణమైన చర్యగా అభివర్ణించారు. దేవునికి, భక్తులకు మధ్య అర్చకులను మధ్యవర్తులుగా ఆరాధించే సంప్రదాయం మనది.
 
 అలాంటి పూజారులపై భక్తుల ముందు దాడి చేయడం హేయమైన చర్య. ఈ ఘటన వైసీపీ నేతల అధికార మత్తులో మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఏ మాత్రం నిరాదరణకు గురిచేస్తోంది. 
 
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆలయాల్లోని విగ్రహాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆలయ ప్రాంగణంలోనే అర్చకులపై దాడులకు దిగిన పరిస్థితి నెలకొంది. నిందితులపై ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి" అని చంద్రబాబు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments