Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

27 నుంచి ప్రజాగళం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం!!

chandrababu

వరుణ్

, ఆదివారం, 24 మార్చి 2024 (15:13 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ నెల 27వ తేదీ నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. తొలి విడతలో మార్చి 27 నుంచి 31వ తేదీ వరకు ఆయన ప్రచారం నిర్వహిస్తారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ - జనసేన - బీజేపీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులే గెలుపే లక్ష్యంగా ఆయన ప్రజల్లోకి మరింత బలంగా వెళ్ళాలని నిర్ణయించార. ఇందులోభాగంగా తన ఎన్నికల ప్రచారాన్ని ఈ నెల 27వ తేదీ నుంచి చేపట్టనున్నారు. 
 
ప్రతి రోజూ మూడు నుంచి నాలుగు నియజకవర్గాల్లో ప్రచారం చేసేలా ఆయన షెడ్యూల్ ఖరారైంది. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. అలాగే, 28వ తేదీన రాప్తాడు, కదిరి, శింగనమల, 29వ తేదీన కర్నూలు, శ్రీశైలం, నందికొట్కూరు, 30వ తేదీన ప్రొద్దుటూరు, మైదుకూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, 31వ తేదీన కావలి, ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురం నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ నెల 25, 26వ తేదీల్లో ఆయన తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తారు.
 
వైకాపా నుంచి మరో వికెట్ డౌన్... కాషాయం కండువా కప్పుకున్న గూడూరు ఎమ్మెల్యే!! 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా నుంచి మరో వికెట్ పడిపోయింది. గూడూరు ఎమ్మెల్యే, ఐఏఎస్ మాజీ అధికారి వరప్రసాద్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనను బీజేపీ నేతలు సాదర స్వాగతం పలికారు. కాగా, ఈయన రానున్న ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ధావడే సమక్షంలో ఆయన బీజేపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. 
 
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అధిష్టానం పలువురు పెద్దలకు టిక్కెట్లు నిరాకరించిన విషయం తెల్సిందే. మరికొందరిని ఇతర నియోజకవర్గాలకు వలస పంపించింది. టిక్కెట్ దక్కని వారిలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ఒకరు. ఈయన స్థానంలో గూడూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎం. మురళీధర్‌కు టిక్కెట్ కేటాయించింది. దీంతో వరప్రసాద్ కాషాయం పార్టీలో చేరిపోయారు. 
 
కాగా, బీజేపీలో చేరిన వరప్రసాద్ తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. తిరుపతి నియోజకవర్గం నుంచి ఆయనకు కొత్త కాదు. గత 2014లో తిరుపతి ఎంపీగా గెలిచారు. 2019లో గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇపుడు మళ్లీ బీజేపీ తరపున తిరుపతి లోక్‌సభకు పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకోనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా నుంచి మరో వికెట్ డౌన్... కాషాయం కండువా కప్పుకున్న గూడూరు ఎమ్మెల్యే!!