Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన టీడీపీ చీఫ్ చంద్రబాబు

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (12:37 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో ఏపీ సీఐడీ పోలీసులు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను ఏసీబీ కోర్టులో ఆదివారం ఉదయం హాజరుపరిచారు. ఆ సమయంలో ఆయన స్వయంగా కోర్టులో తన వాదనలు వినిపించారు. వాదనలకు అవకాశమివ్వాలని ఆయన కోరగా.. న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. తన అరెస్టు అక్రమమని.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని న్యాయమూర్తి దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. రాజకీయ కక్షతోనే అరెస్ట్‌ చేశారని ఆయన చెప్పారు.
 
'స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు కేబినెట్‌ నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు 2015-16 బడ్జెట్‌లో పొందుపర్చాం. రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌ కేటాయింపులను క్రిమినల్‌ చర్యలతో ప్రశ్నించలేరు. 2021 డిసెంబర్‌ 9 నాటి ఎఫ్‌ఐఆర్‌లో నా పేరు లేదు. అప్పటి రిమాండ్‌ రిపోర్టులోనూ నా పాత్ర ఉందని సీఐడీ పేర్కొనలేదు'. అని చంద్రబాబు తన వాదనలు వినిపించారు.
 
409 సెక్షన్ కేసు నమోదు సరే... సరైన సాక్ష్యం ఎక్కడ : చంద్రబాబు లాయర్ ప్రశ్న  
 
ఏపీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హాజరై ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో 409 సెక్షన్‌ పెట్టడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. ఆ సెక్షన్‌ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలని గుర్తు చేశారు. రిమాండ్‌ రిపోర్టు తిరస్కరించాలంటూ నోటీసు ఇచ్చారు. దీంతో తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు. 
 
కేసులో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? అని సీఐడీని న్యాయమూర్తి ప్రశ్నించారు. సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. శనివారం ఉదయం 6 గంటలకే చంద్రబాబును అరెస్ట్ చేశామని.. 24 గంటల్లోపు కోర్టులో ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. 
 
మరోవైపు, సెప్టెంబరు 10వ తేదీ టీడీపీ చీఫ్ చంద్రబాబు భువనేశ్వరిల పెళ్లి రోజు. 1981 సెప్టెంబర్‌ 10న చెన్నై (నాటి మద్రాసు)లో వారి వివాహం జరిగింది. పెళ్లిరోజుకు ఒక్క రోజు ముందు స్కిల్‌ డెవలప్‌మెంట్ వ్యవహారంలో చంద్రబాబును ఏపీ సర్కారు కక్ష పూరితంగా అరెస్టు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments