Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2000 కరెన్సీ నోట్ల ఉపసంహరణ.. స్వాగతించిన చంద్రబాబు

Webdunia
శనివారం, 20 మే 2023 (11:15 IST)
రూ.2000 కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు శుక్రవారం స్వాగతించారు.
 
"అవినీతి, లాండరింగ్, నిల్వలు మరియు ఓటర్లకు లంచం ఇవ్వడానికి మూలకారణమైన అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయాలని నేను చాలా కాలంగా ప్రచారం చేస్తున్నాను" అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఇది ఆర్థిక వ్యవస్థను పెంపొందించడమే కాకుండా ప్రజల పెద్ద మేలు కోసం చిత్తశుద్ధితో పనిచేసే నిజాయితీపరుల ప్రయత్నాలకు అద్భుతమైన విలువను కూడా జోడిస్తుంది.." అని చంద్రబాబు అన్నారు. 
 
రూ.2000 నోట్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం చాలా శుభసూచకమని, డిజిటల్ కరెన్సీపై తాను చాలా కాలం క్రితమే నివేదిక ఇచ్చానని, నోట్ల రద్దుతో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని, రాజకీయ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు.
 
 రూ.2000 నోట్లు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు దీనికి చాలా వరకు చెక్ పెట్టవచ్చు" అని అనకాపల్లిలో జరుగుతున్న 'ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా జరిగిన భారీ సభను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments