Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిడిపిలో జూనియర్‌కు కీలక పదవి..? రంగంలోకి బాలయ్య...

నందమూరి హరిక్రిష్ణ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటుగా మారింది. ఇప్పుడు ఆ స్థానాన్ని పూడ్చగలిగే వ్యక్తి కోసం పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. పార్టీలోకి ఎన్టీఆర్‌ను తీసుకుంటారన్న ప్రచారం జోరుగా స

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (12:10 IST)
నందమూరి హరిక్రిష్ణ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటుగా మారింది. ఇప్పుడు ఆ స్థానాన్ని పూడ్చగలిగే వ్యక్తి కోసం పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. పార్టీలోకి ఎన్టీఆర్‌ను తీసుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడు ఇదే విషయం తెలుగుదేశం పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. 
 
జూనియర్ ఎన్టీఆర్ పైన టిడిపీలో చర్చ జరుగుతోంది. పార్టీలో కీలకం చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. పొలిట్ బ్యూరోలోకి తీసుకునే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. నందమూరి వారసుడిగా పొలిట్ బ్యూరోలోకి ఎవరిని తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌ను పొలిట్ బ్యూరోలోకి తీసుకుంటే మంచిదన్న అభిప్రాయంలో కొంతమంది నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో అత్యున్నత నిర్ణయం పొలిట్ బ్యూరోకు ఉంటుంది. ఇప్పటికే సిఎం చంద్రబాబు పార్టీ నేతల అభిప్రాయాన్ని తెలుసుకున్నట్లు తెలుస్తోంది. నేతలందరూ నందమూరి కుటుంబంలోని వారైతే బాగుంటుందన్న సలహా కూడా ఇచ్చారు.
 
ఇప్పటికే 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ విస్తృత ప్రచారం చేశారు. అప్పట్లో ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ గత 8 యేళ్ళుగా సినిమాలతో బిజీగా వుంటూ రాజకీయం వైపు వెళ్ళలేదు జూనియర్ ఎన్టీఆర్. తండ్రి హరిక్రిష్ణ మరణం తరువాత ఇప్పుడు టిడిపిలోని అందరిచూపు జూనియర్ ఎన్టీఆర్ పైన పడింది. జూనియర్‌ను ఎలాగైనా ఒప్పించి పార్టీలోకి తీసుకురావాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ బాధ్యతను బాలక్రిష్ణకు అప్పజెప్పారట చంద్రబాబు. తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరోగా కొనసాగేందుకు జూనియర్ ఎన్టీఆర్ కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments