Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'రానా'నా? 'నారా'నా?... ఎన్టీఆర్ బయోపిక్ ఎక్కడ స్టార్టై ఎక్కడ ఎండ్ అవుతుంది?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మహానటుడు ఎన్‌టిఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎన్‌టిఆర్‌’ పేరుతో బయోపిక్‌ రూపొందుతున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు.

'రానా'నా? 'నారా'నా?... ఎన్టీఆర్ బయోపిక్ ఎక్కడ స్టార్టై ఎక్కడ ఎండ్ అవుతుంది?
, సోమవారం, 10 సెప్టెంబరు 2018 (15:25 IST)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మహానటుడు ఎన్‌టిఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎన్‌టిఆర్‌’ పేరుతో బయోపిక్‌ రూపొందుతున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. మొదట తేజ అనుకున్నా… సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యాక… తను ఆ బాధ్యతలు నిర్వర్తించలేనని ఆయన వెనకడుగు వేశారు. ఆ తరువాత క్రిష్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ… తన తండ్రి ఎన్‌టిఆర్‌ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఎన్‌టిఆర్‌ బయోపిక్‌ అంటే ఆయన సీనిమా జీవితంతో పాటు రాజకీయ జీవితానికి ప్రాధాన్యత ఉంటుంది. రాజకీయ జీవితంలో ఆయన అల్లుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో జరిగిన తొలి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ తరపున తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోటీచేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత టిడిపిలో చేరడం, మంత్రిగా పని చేయడం, ఎన్‌టిఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశంతో ఆయన్ను సిఎం పీఠం నుంచి దించడం, తన అల్లుడే తనకు అన్యాయం చేశాడని ఎన్‌టిఆర్‌ ఆక్రోశించడం… ఇదంతా చరిత్ర.
 
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే… ఎన్‌టిఆర్‌ బయోపిక్‌లో చంద్రబాబు నాయుడి పాత్రను ప్రముఖ కథానాయకుడు రానా పోషిస్తున్నారు. లీడర్‌తో మొదలుపెట్టి అనేక భిన్నమైన పాత్రలు పోషించిన రానా ఇప్పుడు నారావారి పాత్రలో కనిపించబోతున్నారు. బాహుబలి సినిమా కోసం కండలు పెంచిన రానా…. నారా పాత్ర కోసం సన్నబడిపోయారు. సినిమా షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. షూటింగ్‌ స్పాట్‌ నుంచి ఎవరో… చంద్రబాబు వేష ధారణలోని రానా ఫొటోలను బయటకు తెచ్చారు. ఇప్పుడు అవి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆ ఫొటోలో రానాను చూస్తే… ’రానా’నా లేదా ‘నారా’నా అనుకునేంతగా ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు 80వ దశకంలో ఎలా వుండేవారో ఆదే రూపులో రానా గెటప్‌ కనిపిస్తోంది. చంద్రబాబు పాత్రలో రానాను చూసి తానే గుర్తుపట్టలేకపోయానని ఆయన తండ్రి, నిర్మాత సురేష్‌ బాబు చెప్పారట.
 
ఒక పాత్రల విషయంలోనే కాదు… కథ విషయంలోనూ ఈ సినిమా ఎంతగానో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎందుంటే ఎన్‌టిఆర్‌ జీవితంలో వెలుగుజిలుగులు ఎన్ని వున్నాయో విషాదమూ అంతే వుంది. ఆయన్ను ముఖ్యమంత్రిగా పదవీచ్యుతుడిని చేసిన తరువాత కుంగిపోయారు. ఆ వేదనలోనే తుదిశ్వాస విడిచారు. నాదెండ్ల భాస్కర్‌రావు మోసం చేసినపుడు ఏ విధంగా జనంలోకి వెళ్లి తన సిఎం పీఠాన్ని నిలబెట్టుకున్నారో… అదేవిధంగా చంద్రబాబు ఇతర తెదేపా ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం పీఠాన్ని అధిష్టించినపుడు తిరిగి దాన్ని చేజిక్కించుకోవాలని తపనపడ్డారు.

అయితే… అంతలోనే ఆయన కన్నుమూశారు. ఇటువంటి అంశాలు సినిమాలో ఉంటాయా, చంద్రబాబు, లక్ష్మీపార్వతి, నాదెండ్ల భాస్కర్‌రావు పాత్రలను ఏవిధంగా చూపించబోతున్నారు అనేదానిపై ఆసక్తి వుంది. అయితే… సినిమా ఎక్కడ నుంచి ప్రారంభించాలో ఎక్కడ ముగించాలో తమకు బాగా తెలుసునని బాలకృష్ణ గతంలోనే వ్యాఖ్యానించారు. మరి ఎక్కడ ప్రారంభించి ఎక్కడ అంతమవుతుందో?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాపం.. చైత‌న్య..‌. అందుకే అలా మాట్లాడాడా?