బాలయ్య ఆ విషయం చెప్పగానే కన్నీళ్ళు పెట్టుకున్నారట కళ్యాణ్‌ రామ్...

నందమూరి కుటుంబంలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నందమూరి హరిక్రిష్ణ మరణం తరువాత బాలక్రిష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కలిసిపోయారు. ఇద్దరూ మాటలు కలిపారు. అంతేకాదు బయోపిక్‌లో కళ్యాణ్‌ రామ్‌కు పెద్ద పాత్రే ఇచ్చేశారట బాలయ్య.

శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (20:21 IST)
నందమూరి కుటుంబంలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నందమూరి హరిక్రిష్ణ మరణం తరువాత బాలక్రిష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కలిసిపోయారు. ఇద్దరూ మాటలు కలిపారు. అంతేకాదు బయోపిక్‌లో కళ్యాణ్‌ రామ్‌కు పెద్ద పాత్రే ఇచ్చేశారట బాలయ్య. 
 
తండ్రి పాత్రలో బాలక్రిష్ణ నటిస్తుండగా హరిక్రిష్ణ పాత్రలో ఆయన కొడుకు కళ్యాణ్‌ రామ్ నటించనున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నందమూరి హరిక్రిష్ణ తన తండ్రి నందమూరి తారకరామారావు రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ చైతన్య రథాన్ని హరిక్రిష్ణ నడిపారు. 
 
దీంతో ఎన్టీఆర్ బయోపిక్‌లో హరిక్రిష్ణ పాత్ర కీలకం. ఇంతకుముందు ఈ పాత్రకి లెంత్ ఇవ్వాలా వద్దా అని ఆలోచించారట. కానీ ఇప్పుడు హరిక్రిష్ణ పాత్ర ఈ సినిమాలో పెద్దదిగా ఉండాలన్న ఆలోచనలో దర్శకుడు క్రిష్ ఉన్నారట. హరిక్రిష్ణ పాత్రకి నందమూరి కళ్యాణ్‌ రామ్‌ను ఫిక్స్ చేశారు నందమూరి బాలక్రిష్ణ. మొన్నటివరకు బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌ల మధ్య విభేదాలు ఉండేవనే ప్రచారం నడిచింది. అందులో ఎంత నిజం వున్నప్పటికీ... అప్పట్లో కళ్యాణ్‌ రామ్‌ను మీడియా... మీరు ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నారా అని అడిగితే నన్ను ఎవరూ అప్రోచ్ అవలేదు అని సమాధానిచ్చారు. 
 
కానీ ఇప్పుడు బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌లు అందరూ కలిసిపోయారు. తన తండ్రి పాత్ర పోషించేందుకు కళ్యాణ్‌ రామ్ వెంటనే అంగీకరించారట. బాలక్రిష్ణ ఈ విషయం చెప్పగానే కన్నీళ్ళు పెట్టుకున్నారట కళ్యాణ్‌ రామ్. ఎన్టీఆర్ బయోపిక్‌లో తను ఊహించని పాత్ర బాలక్రిష్ణ ఇవ్వడంతో కళ్యాణ్‌ రామ్ ఆనందానికి అవధులు లేవట.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం స్టార్ హీరో డైరెక్ష‌న్‌లో నాగార్జున మరో మ‌ల్టీస్టార‌ర్ స్టార్ట్