Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందా? లేదా? 16న క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు

వరుణ్
ఆదివారం, 14 జనవరి 2024 (11:21 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసి స్క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నెల 16వ తేదీన తుది తీర్పును వెలువరించనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై గతంలో పలు దఫాలుగా సుధీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ కేసులో ఈ నెల 16వ తేదీన జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం తీర్పునివ్వనుంది 
 
ఈ అంశంతో ముడిపడిన రెండు కేసుల విచారణ (ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు దాఖలు చేసిన కేసు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు) ఈ నెల 17, 19వ తేదీల్లో విచారణకు రానున్నందున సుప్రీంకోర్టు వాటికంటే ముందు 17-ఎపై నిర్ణయాన్ని వెలువరించనుంది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌ ఈ తీర్పును వెలువరించనున్నట్లు సమాచారం. 
 
హైకోర్టులో తాను వేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి గతేడాది సెప్టెంబరు 22న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు 23న సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేశారు. దాన్ని త్వరగా విచారణకు స్వీకరించాలని 25న ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థలూథ్రా.. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందుకు వెళ్లారు.
 
అప్పుడు సాధ్యం కాకపోవడంతో సీజేఐ దాన్ని మరుసటి రోజు మెన్షన్‌ చేయాలని సూచించారు. ఆ రోజు రాజ్యాంగ ధర్మాసనం కూర్చున్నందున అవకాశం లేక కేసు 27న జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్‌ల ధర్మాసనం ముందుకు వచ్చింది. విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్‌ వైదొలగడంతో వాదనలు కొనసాగలేదు. దాంతో సిద్ధార్థలూథ్రా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందుకు వెళ్లి కేసును అత్యవసరంగా విచారించాలని కోరారు. కోర్టు సెలవులను దృష్టిలో ఉంచుకొని ప్రధాన న్యాయమూర్తి ఈ కేసును అక్టోబరు 3కు వాయిదా వేశారు.
 
తొలిసారి ఈ కేసు జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. విచారణలు కొనసాగుతూ అదే నెల 9, 10, 13వ తేదీలకు వాయిదా పడుతూ వచ్చింది. 13వ తేదీనాడు ధర్మాసనం ఈ కేసుతోపాటు ఫైబర్‌గ్రిడ్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను విచారించింది. రెండు కేసులనూ అక్టోబరు 17కి వాయిదా వేసింది. దసరా, దీపావళి, శీతాకాల సెలవుల వల్ల తీర్పు వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు ఈనెల 16న వెలువడనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments