Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ వస్తే కొంప కొల్లేరే.. మేమొస్తే.. అమరావతి, పోలవరం పూర్తి.. చంద్రబాబు

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (18:24 IST)
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం, అమరావతి పూర్తి చేస్తామని.. వైకాపా చీఫ్ జగన్‌కు అధికారం ఇస్తే అవన్నీ ఆగిపోతాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జగన్‌కు ఓటు వేస్తే నరేంద్ర మోదీకి ఓటు వేసినట్టే అని.. జగన్ సీఎం అయితే రాష్ట్రంలో మైనారిటీలకు భద్రత లేకుండా పోతుందని ఆరోపించారు. 
 
ఎన్నికల్లో టీడీపీని ఏపీ ప్రజలంతా ఆశీర్వదించి గెలిపించాలని ప్రతీ ఒక్కరికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. తాము అధికారంలోకి వస్తే మీ బిడ్డల భవిష్యత్ బాగుంటుందని.. జగన్ అధికారంలోకి వస్తే అరాచకాలు పెరిగిపోతాయని చెప్పారు. తాము అధికారంలో ఉంటే భూముల రేట్లు పెరుగుతాయని.. జగన్ అధికారంలో ఉంటే అవినీతి పెరిగిపోతుందని పేర్కొన్నారు.  
 
సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం ముగింపు అనంతరం అమరావతి ప్రజావేదికలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర పరిస్థితులను ప్రస్తావించారు. ఈ క్రమంలో నరేంద్ర మోదీ ఇచ్చిన మాట తప్పిన వైనాన్ని అందరికీ గుర్తుచేశారు. అందుకోసం గత ఎన్నికల్లో మోదీ ఏపీలో బహిరంగ సభల్లో ఏమేమి హామీలు ఇచ్చారో ప్రత్యేకంగా క్లిప్పింగ్‌లు వేసి ప్రదర్శించారు.  
 
ఆ తర్వాత కేసీఆర్ గతంలో ఏమన్నాడో కూడా క్లిప్పింగ్స్ రూపంలో చూపించారు. ఆఖరికి కల్వకుంట్ల కవిత కూడా పోలవరం ప్రాజక్ట్‌కు వ్యతిరేకంగా తామేం చేశామో వివరంగా చెప్పడం మరో క్లిప్‌లో చూపించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై అప్పుడేమన్నారో ఇప్పుడేమన్నారో కూడా చంద్రబాబు స్వయంగా యాంకరింగ్ చేస్తూ ఒక్కో క్లిప్‌ను ప్రదర్శించారు. 
 
ఓ క్లిప్‌లో కవిత మాట్లాడుతూ, జగన్ వస్తాడు, పోలవరం కడతాడు, అంటున్నారని, అన్ని కేసులున్న నాయకుడ్ని తెలంగాణ జైళ్లలో కూడా ఉంచబోమని చెప్పారు. అలాంటి నాయకుడ్ని తమ జైళ్లలో పెడితే జైళ్ల భూముల్ని కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుందన్నారు. అందుచేత ఏపీలో టీడీపీనే అధికారంలోకి రావాలని చంద్రబాబు చెప్పకనే చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments