Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప' చిత్రంలో నా ఫోటో చూపించారనీ వైకాపా నేతలు ఏడుస్తున్నారు : చంద్రబాబు

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (13:45 IST)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్‌లో తన ఫోటో ఉందని వైకాపా నేతలు ఏడుస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అదేసమయంలో అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయన తాజాగా విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, 'పుష్ప' చిత్రంలో ఎర్ర చందనం స్మగ్లర్‌గా హీరో అల్లు అర్జున్ ఎంతగానో మెప్పించారని అన్నారు. స్మగ్లర్‌గా నటించినందుకు అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు ఇస్తే, వైకాపాని నిజమైన ఎర్ర చందనం స్మగ్లర్లు ఏ అవార్డు ఇవ్వాలని చంద్రబాబును ఓ విలేఖరి ప్రశ్నించారు. 
 
దీనికి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, 'పుష్ప' చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్‌లో నా ఫోటో ఉంటుంది. ఆ సినిమాలో చూపించిన కాలంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నానో లేదంటే ఎర్ర చందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాననో వాళ్లు నా ఫోటో పెట్టి ఉండొచ్చు. దానికే వైకాపా నేతలు ఏడుస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
ఇక ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. 'ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు. అలాగే, వివిధ విభాగాల్లో పురస్కారాలు సొంతం చేసుకున్న వారందరికీ అభినందనలు' అంటూ సోషల్ మీడియా వేదికగా తన విషెస్‌ తెలియజేశారు. ఇక 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్‌ ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తూ పోలీసులకు దొరికినప్పుడు అక్కడ పోలీస్‌ స్టేషన్‌లో గోడకు చంద్రబాబు ఫొటో ఉంటుంది. అలాగే మరో సన్నివేశంలోనూ ఆయన ఫొటోను చూడొచ్చు. ఈ ఫోటోలనే వైకాపా నేతలు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments