Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబా మజాకా.... కాంగ్రెస్ పెద్దలను కూడా కొనేసిన చంద్రబాబు : విజయసాయి

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (12:31 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పెద్దలను కూడా బాబు డబ్బుతో కొనిపడేశారంటూ ఆరోపించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితుడయ్యారు. 
 
దీనిపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ, చంద్రబాబు ఒక పొలిటికల్ బ్రోకర్ అని అన్నారు. పొలిటికల్ బ్రోకర్ చంద్రబాబు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడని విమర్శించారు.
 
ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కొనిపడేసి, తన శిష్యుడు రేవంత్‌కు అధ్యక్ష పీఠాన్ని ఇప్పించుకున్నాడని అన్నారు. కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని భ్రష్టు పట్టించాడని దుయ్యబట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్‌గా తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడని అన్నారు.  
 
కేసుల నుంచి రక్షణ కోసం నలుగురు ఎంపీలకు చంద్రబాబు బీజేపీ తీర్థం ఇప్పించారని విజయసాయి విమర్శించారు. ‘మనవాళ్లు బ్రీఫుడ్ మీ’ కేసు ఎప్పటికీ తేలకుండా తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని గులాబి పార్టీలోకి చొప్పించారని ఆరోపించారు. 
 
పచ్చ రక్తం నరనరాల్లో ప్రవహించే కరడు కట్టిన ముఖ్యులను ముందుగానే కాంగ్రెస్‌లోకి తోలారని అన్నారు. 'బాబా మజాకా!' అంటూ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal engagment: నేడు నిశ్చితార్థం జరుపుకున్నవిశాల్, సాయి ధన్సిక

Chiru: అభిమాని రాజేశ్వరి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయ స్పందన

Shilpa: సుధీర్ బాబు జటాధర నుంచి తాంత్రిక పూజ చేస్తున్న శిల్పా శిరోద్కర్‌ లుక్

Barbaric Review: మారుతి సమర్పించిన త్రిబాణధారి బార్బరిక్ మూవీ రివ్యూ

Honey Rose: బులుగు చీర, వాలు జడ, మల్లెపువ్వులు.. మెరిసిపోయిన హనీరోజ్ (Photos)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments