Webdunia - Bharat's app for daily news and videos

Install App

409 సెక్షన్ మోపడం... సాక్ష్యాధారులు చూపాలి : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (13:22 IST)
టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదు చేసిన సెక్షన్లలో 409 ఉండటం వల్లనే సీఐడీ పోలీసులు 41ఏ సీఆర్పీసీ నోటీసు ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయగలిగారని సీబీఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణ అన్నారు. నేరం మోపినంత మాత్రాన సరిపోదని అరెస్ట్‌కు గల కారణాలను వివరిస్తూ అంతిమ లబ్ధిదారు చంద్రబాబు అని దర్యాప్తు సంస్థ బలమైన ఆధారాలు చూపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 
 
'ఒకవేళ సీఐడీ గనక చంద్రబాబును కస్టడీకి అడిగితే అందుకు గల కారణాలను వివరించాల్సి ఉంటుంది. పోలీస్‌ కస్టడీ అవసరం లేదనుకుంటే న్యాయస్థానం జ్యుడిషియల్‌ కస్టడీ విధించే అవకాశముంది. ఈ రెండింటిలో ఏది జరిగినా వెంటనే హైకోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆదివారం అయినా సరే హౌస్‌మోషన్‌ మూవ్‌ చేసేందుకు అవకాశముంది' అని వివరించారు. 
 
409 సెక్షన్ కేసు నమోదు సరే... సరైన సాక్ష్యం ఎక్కడ : చంద్రబాబు లాయర్ ప్రశ్న 
 
ఏపీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హాజరై ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో 409 సెక్షన్‌ పెట్టడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. ఆ సెక్షన్‌ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలని గుర్తు చేశారు. రిమాండ్‌ రిపోర్టు తిరస్కరించాలంటూ నోటీసు ఇచ్చారు. దీంతో తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు. 
 
కేసులో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? అని సీఐడీని న్యాయమూర్తి ప్రశ్నించారు. సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. శనివారం ఉదయం 6 గంటలకే చంద్రబాబును అరెస్ట్ చేశామని.. 24 గంటల్లోపు కోర్టులో ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. 
 
మరోవైపు, సెప్టెంబరు 10వ తేదీ టీడీపీ చీఫ్ చంద్రబాబు భువనేశ్వరిల పెళ్లి రోజు. 1981 సెప్టెంబర్‌ 10న చెన్నై (నాటి మద్రాసు)లో వారి వివాహం జరిగింది. పెళ్లిరోజుకు ఒక్క రోజు ముందు స్కిల్‌ డెవలప్‌మెంట్ వ్యవహారంలో చంద్రబాబును ఏపీ సర్కారు కక్ష పూరితంగా అరెస్టు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments