Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకు మహాకుట్ర : పార్టీ నేతలతో చంద్రబాబు

తమపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకు మహాకుట్ర జ

Webdunia
గురువారం, 15 మార్చి 2018 (10:45 IST)
తమపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకు మహాకుట్ర జరుగుతోందని, ఇందులో స్థానిక నేతల భాగస్వామ్యం కూడా ఉందంటూ ఆరోపించారు. ఇలాంటి కుట్రలను ప్రజలే తిప్పికొడతురాంటూ ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, ఈ తరహా కుట్రలను టీడీపీ సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడిందని ఆయన గుర్తుచేశారు. అదేసమయంలో ఈ కుట్రలో భాగస్వామ్యులైన వారిని గుర్తించే ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. 
 
ఆయన గురువారం పార్టీ నేతలతో స్పందిస్తూ, తనను, తన కుమారుడు లోకేష్‌నూ విమర్శించడానికే పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకున్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా రాలేదన్న ఆగ్రహం ప్రజల్లో తీవ్రంగా పెల్లుబుకుతున్న వేళ, హోదా సాధన కోసం ఏం చేస్తామన్న విషయాన్ని చెప్పకుండా, వేరెవరి చేతుల్లోనో కీలుబొమ్మగా మారిన పవన్, చౌకబారు విమర్శలతో ప్రచారం పొందాలని చూస్తున్నాడని ఆరోపించారు. 
 
తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆస్తిపాస్తుల వివరాలను ప్రతి సంవత్సరమూ పారదర్శకంగా మీడియా ముందు బహిర్గతం చేస్తున్నామని వెల్లడించిన ఆయన, ఎన్నికల కోసం కోట్లు కూడబెట్టినట్టు పవన్ చేసిన ఆరోపణలపైనా మండిపడ్డారు. హోదాను ఇవ్వని ప్రధాని నరేంద్ర మోడీ గురించి ఒక్క విమర్శ కూడా చేయని ఆయన తీరును చూస్తుంటే తనకు ఎన్నో అనుమానాలు వస్తున్నాయని ఎమ్మెల్యేలు, మంత్రులతో టెలీ కాన్ఫరెన్స్‌ మీటింగ్ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments