ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్షకు సిద్ధం - పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీ ఎదురుగా ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సీఎం అని నినదిస్తున్న వారిని ఉద్దేశించి... ఎప్పటికి సీఎం కావాలి అని ప్రశ్నించారు. నాకు సేవ చేయ
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీ ఎదురుగా ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సీఎం అని నినదిస్తున్న వారిని ఉద్దేశించి... ఎప్పటికి సీఎం కావాలి అని ప్రశ్నించారు. నాకు సేవ చేయటం కావాలి అంటూ గుంటూరు శేషాంధ్ర శర్మ పేరును ప్రస్తావించారు పవన్. మీ అన్న, తమ్ముడుగా పార్టీ పెట్టానని ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
కేంద్రం అంటే నాయకులకు భయం. అరుణ్ జైట్లీ కోసం క్యాపిటల్ అమరావతి నుండి మాట్లాడుతున్నా... ఏపీ ప్రజలకు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా బాధగా ఉంది అన్నారు. అలాంటప్పుడు తెలంగాణ ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు. అప్పుడు ప్రేత్యేక హోదా ఇస్తామని ఇప్పుడు ఏమి అయ్యింది అని నిలదీసారు.
తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం కేంద్రాన్ని నిలదీస్తున్నాం.. అవినీతిపరులు కేంద్రం అంటే భయపడతారేమో...
మాకు భయం లేదు. రోడ్ల మీదకు వస్తాం. జాతీయ రహదారిపైకి వస్తాం. ఢిల్లీకి రాము... అమరవాతిలోనే ఆందోళన చేస్తాం.. కేంద్రానికి చేరేంతవరకు... అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. మరి...ఆమరణ దీక్ష చేస్తారా? చేస్తే ఎప్పుడు..? అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది చర్చనీయాంశం అయ్యింది.