Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి తర్వాత తండ్రిలాంటి బాబాయికి జగన్ ఇచ్చిన గౌరవం అందరికీ తెలుసు...

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (09:09 IST)
వయసులో పెద్దవారైన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను గౌరవించాలని వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందని టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేస్తూ, గవర్నర్‌ను ఎలా గౌరవించాలో తమకు జగన్ చెప్పాల్సిన పనిలేదన్నారు.
 
వయసులో పెద్దవారైన గవర్నర్‌ను గౌరవించాలని జగన్ చెబుతున్నారని, మరి వయుసులో పెద్దవారు, తండ్రి తర్వాత తండ్రిలాంటి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డికి ఆయనిచ్చిన గౌరవం ఏపాటిదో అందరికీ తెలుసని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. 
 
కాగా, సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల తొలి రోజున గవర్నర్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళన చేస్తూ, గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను కూడా వారు చింపివేశారు. ఈ చర్యలపై సీఎం జగన్ టీడీపీ సభ్యులపై మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments