Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలి : కేంద్ర హోం శాఖ ఆదేశం

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (10:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డికి కేంద్రం హోం శాఖ లేఖ రాసింది. పైగా, ఆయనపై తీసుకున్న చర్యలను వివరిస్తూ ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 
 
సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోఅక్రమ అరెస్టులు, కస్టోడియల్ టార్చర్ వంటివి జరుగుతున్నాయంటూ ప్రముఖ న్యాయవాది గూడాటి లక్ష్మీనారాయణ కేంద్ర హోం శాఖకు గత అక్టోబరు నెలలో ఫిర్యాదు చేశారు. 
 
ప్రతిపక్ష నేతలు, విపక్ష పార్టీలకు చెందిన నేతలతపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారిగా నడుచుకోవాల్సిన ఆయన తన పరిధిని దాటి అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు నడుచుకుంటున్నారని గూడపాటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఈ లేఖపై కేంద్ర హోం శాఖ స్పందించింది. సునీల్ కుమార్‌పై తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కాగా, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుల్లో ఒకరిగా ఉన్న సునీల్ కుమార్.. వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేసి చిత్ర హింసలు పెట్టడమే కాకుండా శారీరకంగా, మానసికంగా తీవ్ర హింసకు గురిచేశారు. లోక్‌సభ సభ్యుడు అనే విషయం కూడా మరిచి ఆయనపై భౌతికంగా దాడులు చేయించాడు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments