Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్‌ వివేకా హత్య కేసు.. రంగంలోకి దిగిన సీబీఐ.. అసలైన నిందితుని కోసం..?

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (16:48 IST)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో 16 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ గతంలో వేసిన సిట్ ఏమీ తేల్చలేదు. దీంతో కోర్టు ఆదేశాలతో కడప చేరుకున్న సీబీఐ అధికారులు.. రంగంలోకి దిగారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడుగురు సభ్యుల బృదం కడప జిల్లాకు చేరుకుంది. ఈ మేరకు ఎస్పీ అన్బురాజన్‌తో సమావేశమై కేసుపై చర్చించారు. 
 
కడప, పులివెందులలో సీబీఐ అధికారులు వారం రోజులపాటు మకాం వేయనున్నారు. అటు వివేకా హత్యకేసు విచారణ అధికారి డిఎస్పీ వాసుదేవన్‌ను కూడా సీబీఐ అధికారులు విచారించనున్నారు. హత్య కేసుకు సంబంధించిన డాక్యూమెంట్లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
హత్య జరిగిన వివేకా ఇంటిని కూడా సీబీఐ అధికారులు పరిశీలిస్తారు. సిట్‌లో భాగంగా విచారణ జరిపిన అధికారులను కూడా వేర్వేరుగా విచారించనున్నారు. వివేకా హత్యకు గురైన పులివెందులలోని ఇంటిని సీబీఐ అధికారులు ఆదివారం పరిశీలించారు. అక్కడ కీలక సోదాలు నిర్వహించిన అనంతరం.. సీబీఐ బృందం పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. 
 
కాగా.. మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, వైఎస్ కుటుంబంలో ముఖ్యుడైన వైఎస్ వివేకానంద రెడ్డి గత ఏడాది మార్చి 15న పులివెందులలోని తన సొంతింట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం 3 సార్లు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరిపించగా, మొత్తం 1,300 మంది అనుమానితులను గుర్తించినా, అసలైన నిందితులు ఎవరేది మాత్రం తేల్చలేదు. 
 
ఏపీ సర్కారు దర్యాప్తు చేయిస్తోన్న తీరుపై వివేకా కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments