వైఎస్ వివేకా హత్య కేసు : రంగంలోకి దిగిన సీబీఐ టెక్నికల్ టీమ్ - సీన్ రీకన్‌స్ట్రక్షన్

Webdunia
శనివారం, 25 జులై 2020 (10:38 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు సేకరించలేక పోయిన సీబీఐ.. ఇపుడు టెక్నికల్ టీమ్‌ను రంగంలోకి దించింది. 
 
ఈ కేసు విచారణలో భాగంగా నేడో రేపో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పులివెందులలో నేడు కీలక వ్యక్తులను విచారించనుంది. ఇప్పటికే శుక్రవారం వివేకా పీఏ క్రిష్ణారెడ్డిని, వాచ్‌మెన్ రంగన్నని అతని కుమారుడు ప్రకాష్‌ను సీబీఐ అధికారులు విచారించారు. గత రెండు రోజులుగా వివేకా నివాస పరిసర ప్రాంతాలను సీబీఐ, సాంకేతిక నిపుణుల బృందాలు పరిశీలిస్తున్నాయి. 25 మందికి పైగా సీబీఐ, సాంకేతిక బృందాలు రంగంలోకి దిగాయి.
 
మరోవైపు, ఈ కేసు విచారణ నిమిత్తం ఢిల్లీ, చెన్నై నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం కడపలో ఉంటూ, రోజూ పులివెందుల వెళ్లి దర్యాప్తు చేసి వస్తున్నారు. వాచ్‌మెన్‌గా ఉన్న రంగన్నతో పాటు కారు డ్రైవర్ ప్రసాద్‌ను శుక్రవారం విచారించారు. ఈ విచారణ జరుపుతూ వివేకాను హత్య చేసిన ఇంట్లో సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తున్నారు. సీబీఐ విచారణ నేపథ్యంలో పులివెందులలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

Akhanda 2: అఖండ 2 క్రిస్ మస్ కు తాండవం చేస్తుందా ? దామోదర ప్రసాద్ ఏమన్నారంటే..

మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం చాలా ఇష్టం : మెహర్ రమేష్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments