Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు సీబీఐ నోటీసులు

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:46 IST)
మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు. ఈ నెల 6న సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో కోర్టులు, జడ్జిలను విమర్శించిన కేసులో ఆమంచి కృష్ణమోహన్కు సీబీఐ నోటీసులిచ్చింది.

గతంలో న్యాయస్థానానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ, న్యాయమూర్తులను దూషిస్తూ, వారిని ముక్కలుగా నరకాలి అని హెచ్చరిస్తూ సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా, విచ్చలవిడిగా చెలరేగిపోయిన వారిపై రాష్ట్ర హైకోర్టు చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే.

ఇప్పటికి తాము గుర్తించిన 49 మందికి ‘కోర్టు ధిక్కరణ’ కింద నోటీసులు జారీ చేసింది. వీరిలో అధికార పార్టీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు, డాక్టర్ సుధాకర్ కేసుల్లో తీర్పు చెప్పిన తర్వాత అధికార పార్టీ నేతలు నేరుగా  కోర్టులను, జడ్జిలను విమర్శించారు.

ఇక వైసీపీ అభిమానులు ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు. జడ్జిలను తీవ్ర అసభ్య, అసహ్య పదజాలంతో దూషించారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments