Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2023 (14:23 IST)
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా విశాఖపట్టణం లోక్‌సభ నుంచి పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఆయన విశాఖ నుంచి పోటీ ఓడిపోయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తలెత్తిన చిన్నపాటి మనస్పర్థలు కారణంగా ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 
 
ఇపుడు మళ్లీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా? మళ్లీ విశాఖ నుంచి బరిలో దిగుతారా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన తన రాజకీయ భవిష్యత్ పై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.
 
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీలో చేరబోనని, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని వెల్లడించారు. ఎక్కడి నుంచి  అనేది ఇంకా నిర్ణయించుకోలేదని, త్వరలోనే చెబుతానని వివరించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్థానం చూస్తే విశాఖ కేంద్ర బిందువుగానే ఆయన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 
 
విశాఖ ఉక్కు పరిశ్రమ వ్యవహారంలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌కు మేలు జరిగితే అదే చాలు అనే ఉద్దేశంతో ఆయన ఆఖరికి కేఏ పాల్ వంటి నేతను కూడా కలిశారు. ఓ దశలో స్టీల్ ప్లాంట్‌ను కొనడానికి బిడ్ దాఖలు చేసి, క్రౌడ్ ఫండింగ్ ద్వారా మూలధన నిధుల సేకరణకు కూడా నడుం బిగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటీనటులకు ప్రభుత్వం ఏమి చేయాలో చెప్పనవసరం లేదు- సిద్ధార్థ్

ప్రణీత్ హనుమంతుపై ఫైర్ అయిన సుధీర్ బాబు.. చీడపురుగు అంటూ?

ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా చిత్రం.. స్పిరిట్‌లో కొరియన్ యాక్టర్?

ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ చీరలో బుట్టబొమ్మ

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెల్లుల్లి వాసన పడదా.. మహిళలు రెండు రెబ్బలు తింటే?

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

తర్వాతి కథనం
Show comments