Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనీలాండరింగ్ కేసులో సీఎం జగన్‌కు షాకిచ్చిన నాంపల్లి కోర్టు

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (09:00 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. వాన్‌పిక్ ప్రాజెక్టు వ్యవహారంలో మనీలాండరింగ్ అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరే (ఈడీ) ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. సెప్టెంబర్ 22న విచారణకు హాజరుకావాలని జగన్‌ను ఆదేశించింది. 
 
అలాగే, ఈ కేసులో సహ నిందితులైన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యే మోపిదేవి వెంకటరమణ, ఐఆర్‌టీఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి, పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాష్, ఐఏఎస్ అధికారులు శామ్యూల్, మన్మోహన్ సింగ్, జగతి పబ్లికేషన్స్ సహా 12 కంపెనీలకు సీబీఐ కోర్టు సమన్లు పంపింది.
 
వాన్‌పిక్ వ్యవహారంలో చేతులు మారిన సొమ్ముపై మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ విచారణ జరిపింది. వివిధ కంపెనీల ద్వారా సొమ్ము చలామణి అయినట్లు ఈడీ గుర్తించింది. 
 
కాగా ఈ కేసులో జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ సంస్థలకు చెందిన సుమారు రూ.863 కోట్ల ఆస్తులను 2016లోనే ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. జగన్ కంపెనీలకు చెందిన సుమారు రూ.538 కోట్ల విలువైన ఆస్తులతో పాటు వాన్‌పిక్ భూములు సహా నిమ్మగడ్డ కంపెనీలకు చెందిన రూ.325 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments