Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ బెయిల్ రద్దేనా?

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (13:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారం మరికొన్ని గంటల్లో తేలనుంది. ఆయన బెయిలు రద్దుకు సంబంధించి సీబీఐ కోర్టు బుధవారం మరికొన్ని గంటల్లో తీర్పును వెలువరించనుంది. దీంతో తీర్పు ఏవిధంగా ఉంటుందోనన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ నెలకొనివుంది. 
 
సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిలు రద్దు చేసి వారిపై నమోదైన కేసులను త్వరితగతిన విచారించాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏప్రిల్‌లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాలను జగన్ దుర్వినియోగం చేస్తూ బెయిలు షరతులను ఉల్లంఘిస్తున్నారని అందులో ఆరోపించారు. 
 
ముఖ్యంగా, వివిధ కారణాలు చూపుతూ కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారని రఘురామ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జులైలోనే వాదనలు పూర్తి కాగా తీర్పును సీబీఐ కోర్టు బుధవారానికి రిజర్వు చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనన్న అటు వైసీపీ నేతల్లోను, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

మైఖేల్ జాక్సన్‌కు కలిసిరానిది.. థ్రిల్లర్‌ ఇచ్చిన గిఫ్ట్

నిఖిల్.. స్వయంభు కొత్త షెడ్యూల్ మారేడుమిల్లిలో ప్రారంభం

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments