Webdunia - Bharat's app for daily news and videos

Install App

RRR పైన సీబీఐ చీటింగ్ కేసు: రఘురామకృష్ణ రాజు ఇక మాట్లాడతారా?

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (22:34 IST)
బ్యాంకుల మోసానికి పాల్పడ్డారంటూ వైసిపి ఎంపీ రఘురామకృష్ణం రాజుపై సీబీఐ కేసు నమోదయ్యింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. మొత్తం రూ. 826.17 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు తమకు ఫిర్యాదు అందిందని వెల్లడించింది.
 
బ్యాంకుల మోసానికి పాల్పడి నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డారనీ, హైదరాబాద్, ముంబై, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 11 ప్రదేశాల్లో ఈ మేరకు సోదాలు నిర్వహించినట్లు ప్రెస్‌నోట్‌లో వెల్లడించింది. రఘురామకృష్ణంరాజు సహా 9 మందిపై సీబీఐ చీటింగ్‌ కేసు నమోదు చేసింది.
 
కాగా గత కొంతకాలంగా రఘురామకృష్ణ రాజు వైసిపిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మీడియాలో RRRగా పాపులర్ కూడా అయ్యారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments