Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు నోటు కేసు : చంద్రబాబు నిద్రలేని రాత్రి.. హైకోర్టు దిశగా అడుగులు

తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసిన ఓటుకు నోటు కేసును పునర్విచారణ జరపాలంటూ ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్రలేని రాత్రి గడిపినట్టు సమాచారం

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (14:07 IST)
తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసిన ఓటుకు నోటు కేసును పునర్విచారణ జరపాలంటూ ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్రలేని రాత్రి గడిపినట్టు సమాచారం. ఈ కేసును మళ్లీ విచారణ జరపి, నెల రోజుల్లో నివేదిక సమర్పించాలంటూ ప్రత్యేక కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయంతెల్సిందే. 
 
దీంతో తనపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే ఏం చేయాలన్న దానిపై ఏపీ ఇంటెలిజెన్స్, న్యాయ సలహాదారులు తదితరులతో ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం రాత్రి సమయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదు చేస్తే ఎలాగైనా విచారణను ఆపించేందుకు ప్రయత్నించాలని, ఇందుకు ఉన్న మార్గాలపై బుధవారం ఉదయానికల్లా తనకు చెప్పాలని ఆదేశించారని తెలుస్తున్నది. 
 
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత హైకోర్టు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కూడా చంద్రబాబు ఆదేశించారని సమాచారం. ఓటుకు నోటు కేసు బయటకు వచ్చిన సమయంలో ఏర్పాటుచేసిన సిట్‌ను మళ్లీ రంగంలోకి దించడం, ట్యాపింగ్ అంశాన్ని మళ్లీ ముందుకు తేవడంతోపాటు రాజకీయంగా ఎదురుదాడి చేసేలా కూడా వ్యూహాలు రచించాలని అధికారులకు, తన ఆంతరంగికులకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

సామాన్యులే సెలబ్రిటీలుగా డ్రింకర్ సాయి టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

తర్వాతి కథనం
Show comments