Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్ నీటిమట్టం

చాలా రోజుల తర్వాత రాజధాని హైదరాబాద్ భారీ వర్షంతో తడిసి ముద్దయింది. అల్పపీడన ప్రభావంతో ఉదయం నుంచే అహ్లదకరంగా మారింది. మధ్యాహ్నం నుంచి మంచి వర్షం కురవటంతో పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు ఏరులో పారుతోంది.

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (14:06 IST)
చాలా రోజుల తర్వాత రాజధాని హైదరాబాద్ భారీ వర్షంతో తడిసి ముద్దయింది. అల్పపీడన ప్రభావంతో ఉదయం నుంచే అహ్లదకరంగా మారింది. మధ్యాహ్నం నుంచి మంచి వర్షం కురవటంతో పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు ఏరులో పారుతోంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయింది. ఏకధాటిగా కురిసిన భారీ వ‌ర్షానికి హుస్సేన్ సాగ‌ర్ జ‌లాశ‌యంలో ఒక్క‌సారిగా నాలుగు అడుగుల‌కు పైగా నీటి మట్టం పెరిగింది. దీంతో హుస్సేన్ సాగర్ సమీపంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 
 
బంజారాహిల్స్, సోమాజిగూడ, బేగంపేట, మెహిదీపట్నం, టోలీచౌకీ, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు వరదగా మారి హుస్సేన్ సాగర్‌లోకి ఒక్కసారిగా వచ్చి చేరడంతో నీటి మట్టం పెరిగిందని అధికారులు అంటున్నారు. మరో రెండు అడుగుల నీరు చేరితే, గేట్లు తెరిచి మూసీ నదిలోకి నీటిని వదలాల్సి వుంటుందని అధికారులు అంటున్నారు. 
 
ఈ నేప‌థ్యంలో మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కాలనీల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రహదారులపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని పలుచోట్ల వాహనాలు నీట మునిగాయి. భారీగా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా పలు ఎంఎంటీస్ రైళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments