రాయలసీమ గ్యాంగ్ కబ్జా వివాదం : ఎంపీ టీజీ వెంకటేష్‌పై కేసు -

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (15:30 IST)
కర్నూలు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు, సీనియర్ రాజకీయ నేత టీజీ వెంకటేష్ వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబరు 10లో రూ.100 కోట్ల విలువ చేసే వివాదాస్పద భూమి వ్యవహారంలో ఆయనపై హైదరాబాద్ నగరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు కుమారుడు విశ్వప్రసాద్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు రోడ్డు నంబరు 10లో ఏపీ జెమ్స్ అండ్ జ్యూవెలర్స్‌ పార్క్ కోసం గత 2005లో అప్పటి  ప్రభుత్వం రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో ఇప్పటికే భవన నిర్మాణాలు చేపట్టారు. అయితే, ఈ స్థలాన్ని ఆనుకుని మరో అరెకరం స్థలాన్ని టీజీ వెంకేటేష్ సోదరుడు కుమారుడు సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌తో పాటు మరికొందరు ఇటీవల డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. దీంతో ఈ స్థలం స్వాధీనం చేసుకునేందుకు కర్నూలు జిల్లా ఆదోనీ నుంచి దాదాపు 90 మంది హైదరాబాద్ నగరానికి చేరుకుని సెక్యూరిటీ గార్డు పట్ల దురుసుగా ప్రవర్తించారు. 
 
దీనికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని 63 మందిని అరెస్టు చేశారు. మిగిలినవారంతా పారిపోయారు. వారంతా తమ వెంట తెచ్చిన మారణాయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో టీజీ వెంకటేష్, టీజీ విశ్వప్రసాద్, వీవీఎస్ శర్మ సహా మొత్తం 15 మంది ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో వీరందరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shobhita Dhulipala: నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ తో శోభిత ధూళిపాళ తమిళ్ ఎంట్రీ ?

Rakul Preet Singh : ఐటం గాళ్ గా అలరించిన రకుల్ ప్రీత్ సింగ్

నారా రోహిత్ పెళ్లాడిన సిరి ఎవరో తెలుసా? సీఎం బాబు దంపతుల ఆశీర్వాదం

Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్ నుంచి కురిసే వాన.. లిరికల్ సాంగ్ రిలీజ్

Rohit Nara:.నటి సిరి లెల్లాతో రోహిత్ నారా వివాహం హైదరాబాద్ లో జరిగింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments