Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం: భక్తురాలు మృతి

ఐవీఆర్
శనివారం, 30 మార్చి 2024 (23:23 IST)
తిరుమల ఘాట్ రోడ్డులో శనివారం నాడు జరిగిన కారు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన 43 ఏళ్ల భక్తురాలు భవాని మృతి చెందారు. భవాని తన కుటుంబంతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు. టీటీడీ విజిలెన్స్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఘాట్‌ రోడ్డులో ఎలిఫెంట్‌ గేట్‌ సమీపంలోకి వారి వాహనం రాగానే అక్కడ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో భవానీ అక్కడికక్కడే మృత్యవాత పడ్డారు.
 
తన భర్త మురళీధర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. పిల్లలు నిసెర్గ(8), రక్షిత(6)కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని తిరుమల టిటిడి అశ్విని ఆసుపత్రిలో చేర్పించారు. టీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆస్పత్రిని సందర్శించి క్షతగాత్రులైన ముగ్గురి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈఓ సూచన మేరకు గాయపడిన ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments