Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిదే అంతిమ విజయం : చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (14:31 IST)
రాజధాని ప్రాంత రైతుల ఉద్యమంలో న్యాయముందని, అంతిమ విజయం అమరావతిదేని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ధర్మం వారివైపే ఉందని.. అమరావతే గెలుస్తుందన్నారు. రాజధాని రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా ఆయన ట్వీట్‌ చేశారు. రైతుల పోరాట స్ఫూర్తిని చంద్రబాబు అభినందించారు. అమరావతి ఉద్యమం వైకాపా ప్రభుత్వ ఆంక్షలు, వేధింపులు, సంకెళ్లను ఎదిరించి ముందుకు సాగుతోందన్నారు. అంతిమంగా గెలిచేది.. నిలిచేది అమరావతేనని ఆయన పేర్కొన్నారు. 
 
అదేసమయంలో అనంతపురం జిల్లాలో టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన కియా పరిశ్రమపై గతంలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను మరో ట్వీట్‌లో చంద్రబాబు ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కియాను తరిమేస్తానంటూ ప్రతిపక్ష నేతగా జగన్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు. కియాపై నాడు జగన్‌ చేసిన వ్యాఖ్యలు.. తాజాగా లోకేశ్‌ సెల్ఫీ ఛాలెంజ్‌లను ప్రస్తావిస్తూ వీడియోలను చంద్రబాబు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. కెన్‌యూ ఆన్సర్‌ మిస్టర్‌ జగన్‌? అంటూ మాజీ సీఎం చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments