Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్ డోజ‌ర్ ప‌నులు ఎక్కువ వ‌చ్చాయ‌నే ఈర్ష్య‌తో...

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (15:38 IST)
త‌న‌కు రాని కాంట్రాక్ట్ ప‌నులు, తోటి స్నేహితుడికి ఎక్కువ వ‌చ్చాయ‌నే ఈర్ష్య‌తో క‌క్ష‌గ‌ట్టి చంపేసిన ఓ నిందితుడి ఉదంత‌మిది. ప్రకాశం జిల్లా గిద్దలూరులో స్నేహితుడిని మట్టుబెట్టిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించిన పోలీసులు, అత‌డు ఈర్ష్య‌తో స్నేహితుడిని పథకం ప్రకారమే హత్య చేసినట్లు వెల్లడించారు. 

 
మీడియాకు డిఎస్పి కిషోర్ కుమార్ వెల్లడించిన వివరాల మేరకు, గిద్దలూరు మండలం దేవ నగర్ గ్రామానికి చెందిన చాగలమరి సిద్దయ్య గత 20 సంవత్సరాలుగా డోజర్ సహాయంతో పొలం చదును చేసే పనుల్లో సిద్ధహస్తుడిగా ఉన్నాడు. అదే వృత్తిని ఎంచుకొని జీవనం సాగిస్తున్న చింతకుంట్ల శ్రీకాంత్ కు పనులు తక్కువగా రావడం వల్ల సిద్దయ్యపై కోపం పెంచుకున్నాడు. సిద్ధ‌య్య‌ను అడ్డు తొలగించుకుంటే తనకే గ్రామంలో పనులు ఎక్కువగా వస్తాయి అని చంపేందుకు పన్నాగం పన్నాడని తెలిపారు.

 
ఈ నెల 17 గురువారం రాత్రి 8 గంటల సమయంలో మరో ఇద్దరు స్నేహితులు గుట్టపాటి బాల హుస్సేనయ్య, పటాన్ ఖాదర్ భాషాలతో కలిసి శ్రీకాంత్, సిద్దయ్య సంజీవ రాయుని పేట, గడికోట ఫారెస్ట్ చెక్ పోస్ట్ మార్గం ఉన్న కల్వర్టుపై మద్యం సేవించారు. అనంతరం ఉద్దేశపూర్వకంగా శ్రీకాంత్ సిద్దయ్యతో గొడవ పెట్టుకొని, అత‌ని శరీరంలోని సున్నితమైన భాగంలో బలంగా కొట్టడం వల్ల సిద్దయ్య చనిపోయాడని తెలిపారు. ఈర్ష్య‌తో స్నేహితుడిని అంతం చేసిన శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments